రవితేజతో మల్టీస్టారర్ చేయాలని ఉంది

Monday,April 13,2020 - 05:00 by Z_CLU

హీరోలంతా ఈ క్వారంటైన్ టైమ్ లో ఫ్యాన్స్ కు దగ్గరవ్వడం కోసం సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారు. మెగాహీరో సాయితేజ్ అయితే ఏకంగా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ పెట్టాడు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చూద్దాం.

ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి నాకు సంవత్సర కాలం ఇస్తే.. ఏదైనా కొత్త భాష నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొత్త భాషలు నేర్చుకోవడం నాకిష్టం.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ మిస్ అవుతున్నాను. ఇక రవితేజతో మల్టీస్టారర్ విషయానికొస్తే మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్

నాకు ముద్దు పేర్లు అంటూ ఏమీ లేవు. అమ్మతో పాటు, మా కుటుంబ సభ్యులంతా నన్ను తేజ్ అని పిలుస్తారు.

అందర్లానే నాక్కూడా పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని ఉంది. ఆ ఛాన్స్ వస్తే మాత్రం పక్కా ఊర మాస్ మసాలా ఎంటర్ టైనర్ లో పవన్ తో కలిసి నటించాలని ఉంది.

నా నెక్ట్స్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. మనలో చాలామంది ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

నాకు చాలా డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. దేవ్ కట్టా దర్శకత్వంలో చేయబోయే పాత్ర అందులో ఒకటి.

నాకున్న ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ ఒకడు. ఇండస్ట్రీకి నేను రాకముందు ఆయన్ని కలిశాను. టాలెంటెడ్ యాక్టర్. ఇక బన్నీ విషయానికొస్తే.. మా జనరేషన్ లో ఎక్కువ కష్టపడి పనిచేసే నటుడు బన్నీ. సినిమా సినిమాకి ఏదో ఒక కొత్తదనం చూపిస్తాడు.