ఆ డైరెక్టర్ తో తేజ్ మరోసారి!

Monday,September 07,2020 - 07:48 by Z_CLU

ప్రస్తుతం మెగా హీరో Sai Dharam Tej చేతిలో సోలో బ్రతుకే సో బెటర్ తో కలిపి మూడు సినిమాలు ఉన్నాయి. Solo Brathuke So Better సినిమాను ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చిన తేజ్ త్వరలోనే Deva katta డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాను మొదలు పెట్టనున్నాడు. అలాగే సుకుమార్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు కార్తీక్ దండుతో తన 15వ సినిమాను చేయనున్నాడు.

ప్రస్తుతం లైనప్ లో ఉన్న దేవకట్ట సినిమా , కార్తీక్ దండు సినిమా తర్వాత GopiChand Malineni తో సినిమా కమిట్ అయ్యాడట తేజ్. గతంలో వీరిద్దరి కాంబోలో ‘Winner’ సినిమా వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తేజ్ తో సినిమా చేయబోతున్నాడట గోపీచంద్. ప్రస్తుతం Raviteja తో చేస్తున్న Krack రిలీజ్ అవ్వగానే Sai tej సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని సమాచారం. మరి ఈ కాంబినేషన్ సినిమాను నిర్మించేదెవరనేది కూడా తెలియాల్సి ఉంది.