లవ్ స్టోరీస్ అంటే ఇష్టం!

Monday,September 07,2020 - 07:40 by Z_CLU

‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన Aditi Rao Hydari ప్రస్తుతం బిజీ స్టార్ గా మారిపోయింది. అటు హిందీ, తమిళ్ లో సినిమాలు చేస్తూనే మధ్యలో తెలుగులో కూడా నటిస్తున్న అదితి తన ఫేవరేట్ జోనర్ లవ్ స్టోరీస్ అంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకి పిరియాడిక్ సినిమాలు చేయాలని ఉందని, అలాగే లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టమని ఆ జోనర్ స్క్రిప్ట్ వస్తే పెద్దగా ఆలోచించకుండా ఓకె చేస్తానని తెలిపింది.

నాని, సుదీర్ బాబు నటించిన ‘V’ సినిమాలో హీరోయిన్ గా నటించింది అదితి. సినిమాలో తక్కువ నిడివి గల పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ త్వరలోనే తెలుగులో ‘సమ్మోహనం’ లాంటి ఫుల్ లెంగ్త రోల్ తో లవ్ స్టోరీ చేస్తానని చెప్పుకొచ్చింది. త్వరలోనే తను నటించబోయే తెలుగు సినిమా డీటెయిల్స్ తో ప్రొడక్షన్ నుండి ఎనౌన్స్ మెంట్ రానుందని హింట్ ఇచ్చింది ముద్దుగుమ్మ.