NBK 107 టైటిల్ రివీల్ చేయబోతున్న మేకర్స్

Tuesday,October 11,2022 - 01:00 by Z_CLU

Nandamuri Balakrishna’s ‘NBK107’ Title reveal soon !

నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్  ‘NBK107’ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు రెడ్డి గారు , జై బాలయ్య అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. తాజాగా జై బాలయ్య అనే సాంగ్ లీకవ్వడంతో ఇటు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇదే టైటిల్ అని ఫిక్సవుతున్నారు.

నిజానికి మేకర్స్ చాలా టైటిల్స్ పరిశీలించారు. ఫైనల్ గా ఓ టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ డిజైనింగ్ వర్క్ చేయిస్తున్నారు. టైటిల్ పవర్ ఫుల్ గా ఉండేలా దర్శకుడు గోపీచంద్ మలినేని కేర్ తీసుకుంటున్నాడు. అందుకే కాస్త ఆలస్యం జరుగుతుంది. ఈ వీకెండ్ లో టైటిల్ రివీల్ చేసి ఓ పోస్టర్ లాంచ్ చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. ఇటివల టర్కీ లో ఓ షెడ్యుల్ పూర్తి చేశారు. హైదరాబాద్ లో చివరి షెడ్యుల్ ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్నారు.