Veerasimhareddy రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న బాలయ్య

Saturday,December 03,2022 - 06:44 by Z_CLU

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. బాలకృష్ణ (Nandamuri Balakrishna) మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌ లో కనిపిస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ లో భారీ అంచనాలని క్రియేట్ చేసింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజైన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య యూట్యూబ్‌ లో భారీ వ్యూస్ కొల్లగొడుతూ దూసుకెళ్తోంది.

రీసెంట్ గా విడుదల తేదీకి సంబంధించి బిగ్ అప్‌డేట్‌ అందించారు మేకర్స్. ‘వీరసింహారెడ్డి’ (VeerasimhaReddy) జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ లో బాలకృష్ణ సీరియస్ లుక్‌ లో కనిపించారు. తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లు కనిపించిన బాలకృష్ణ లుక్ టెర్రిఫిక్ గా వుంది.

సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఇది బాలకృష్ణకు పాజిటివ్ సెంటిమెంట్. పండుగకు విడుదలైన బాలకృష్ణ అనేక సినిమాలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్‌ లు గా నిలిచాయి. పండుగ సెలవులు సినిమా భారీ ఓపెనింగ్స్‌ ను రాబట్టడానికి అనుకూలంగా వుండబోతున్నాయి.

ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics