వెంకీపై ఇష్టాన్ని మరోసారి బయటపెట్టాడు

Monday,September 07,2020 - 07:53 by Z_CLU

తనకు వెంకటేష్ అంటే ఇష్టమని, చిన్నప్పుడు వెంకటేష్ సినిమాలనే ఎక్కువగా లైక్ చేసేవాడినని గతంలోనే ప్రకటించాడు నాని. ఇప్పుడు వెంకటేష్ తో మల్టీస్టారర్ సినిమా చేయాలనే కోరికను బయటపెట్టాడు.

“చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో ఒకేసారి సినిమాలు చేసే అవకాశం వస్తే నేను వెంకటేష్ ను ఎంచుకుంటాను. ఎందుకంటే.. చిరంజీవి-బాలకృష్ణతో చేయాలంటే నాకు భయం. వాళ్లతో యాక్ట్ చేసేటప్పుడు తడబడతానేమో. అదే వెంకటేష్ గారితో అయితే చాలా కంఫర్టబుల్. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనతో కలిసి బాగా చేయగలను.”

ఇలా Venkatesh తో Multi-Starrer Movie చేయాలనే కోరికను బయటపెట్టాడు Nani. వెంకీ టైమింగ్ అంటే తనకు చాలా ఇష్టమంటున్న నాని.. కథ బాగుంటే మల్టీస్టారర్ సబ్జెక్టులు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నాడు.

ఇప్పటికే నాగార్జున, సుధీర్ బాబు, ఆది, కార్తికేయ లాంటి నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న నాని.. వెంకీతో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు ప్రకటించాడు.