సమ్మర్ లో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా

Monday,February 19,2018 - 11:45 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘ఇంటిలిజెంట్’ మూవీతో కంప్లీట్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో అనిపించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తరవాత గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో మరో కమర్షియల్ ఎంటర్ టైనర్ తో రెడీ వుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాని J. భగవాన్ తో పాటు J. పుల్లారావు సంయుక్తంగా శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై నిర్మించనున్నారు.  మే నెలలో సెట్స్ పైకి రానున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

 

గతంలో సాయి ధరమ్ తేజ్ తో ‘విన్నర్’ లాంటి లావిష్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించిన గోపీచంద్ మాలినేని, ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సాయిధరం తేజ్ సరసన నటించబోయే హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.