సాక్ష్యం ఫస్ట్ సింగిల్ - మెలొడీ & బ్యూటిఫుల్

Friday,May 04,2018 - 04:12 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సాక్ష్యం. ఈ సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుంచి సింగిల్స్ రిలీజ్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సౌందర్య లహరి అనే లిరిక్స్ తో సాగే సాంగ్ ను యూట్యూబ్ లో పెట్టారు. హర్షవర్థన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మెలొడియస్ గా స్వీట్ గా ఉంది.

అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను జితిన్, ఆర్తి ఆలపించారు. కర్ణాటక సంగీతానికి, వెస్ట్రన్ టచ్ ఇస్తూ కంపోజ్ చేసిన ఈ సాంగ్ వినగానే ఎవరినైనా ఆకట్టుకుంటుంది. విడుదలైన కొన్ని నిమిషాలకే ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.

రీసెంట్ గా సాక్ష్యం మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. చాలా రిచ్ గా ఉందంటూ అంతా మెచ్చుకుంటున్నారు. శ్రీవాస్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.