మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ‘సాక్ష్యం’ సింగిల్

Thursday,May 10,2018 - 02:49 by Z_CLU

జూన్ 14 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం. భారీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘సౌందర్య లహరి’ యూ ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాలోని యాక్షన్ ప్యాక్డ్ స్పేస్ ని ఎలివేట్ చేస్తే, సౌందర్య లహరి సాంగ్ సినిమాలోని సాఫ్ట్ యాంగిల్ ని హైలెట్ చేసింది. పూజా హెగ్డే, బెల్లంకొండ శ్రీనివాస్ కెమిస్ట్రీ తో పాటు, దర్శకుడు శ్రీవాస్ స్క్రీన్ ప్లే పై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా.

‘నేచర్ ఈజ్ ద విట్నెస్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, మీనా, శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. అభిషేక్ నామా ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.