రంగస్థలం 5 వారాల (35 రోజులు) వసూళ్లు

Friday,May 04,2018 - 05:50 by Z_CLU

సూపర్ హిట్ అయిన రంగస్థలం సినిమా సక్సెస్ ఫుల్ గా 6వ వారం లోకి ఎంటరైంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రతి సెంటర్ లో స్టడీగా వసూళ్లు రాబడుతోంది. ఇన్ని వారాలు గడిచినా ఇంకా వసూళ్లు రావడం బాహుబలి-2 తర్వాత ఇదే. సుకుమార్-చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ ఇప్పటికే 200 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ సినిమాకు ఇప్పటివరకు 116 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. విడుదలైన ఈ 35 రోజుల్లో రంగస్థలం సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

 

ఏపీ, నైజాం 35 రోజుల షేర్

నైజాం – రూ. 27.21 కోట్లు

సెడెడ్ – రూ. 17.91 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 12.81 కోట్లు

ఈస్ట్ – రూ. 7.50 కోట్లు

వెస్ట్ – రూ. 6 కోట్లు

గుంటూరు – రూ. 8.16 కోట్లు

కృష్ణా – రూ. 6.80 కోట్లు

నెల్లూరు – రూ. 3.29 కోట్లు