బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ నుండి మరో సర్ ప్రైజ్

Friday,June 29,2018 - 01:02 by Z_CLU

మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘సౌందర్యలహరి’ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచిన సినిమా యూనిట్ జూలై 7 న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేయనున్నారు.

ఫస్ట్ సింగిల్ తరవాత హర్షవర్థన్ మ్యూజిక్ పై న్యాచురల్ గానే ఎక్స్ పెక్టే షన్స్ ఉన్నాయి. ‘సౌందర్య లహరి’ సాంగ్ తో మెలోడియస్ మ్యాజిక్ చేసిన ఈ కంపోజర్, ఈ ఆల్బమ్ లో ఇంకెన్ని సర్ ప్రైజెస్ ప్లాన్ చేశాడోనన్న క్యూరాసిటీ మ్యూజిక్ లవర్స్ లో క్రియేట్ అయి ఉంది.

 

‘నేచర్ ఈజ్ ద విట్నెస్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, మీనా తో పాటు శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. శ్రీవాస్ ఈ సినిమాకి డైరెక్టర్.