మరో ఛాన్స్ కొట్టేసిన రవితేజ హీరోయిన్...

Friday,May 04,2018 - 03:30 by Z_CLU

రవితేజతో కలిసి రాజా ది గ్రేట్ అంటూ హిట్ కొట్టేసింది మెహ్రీన్. ఆ మూవీ నుంచి ఇప్పటివరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. మధ్యలో ఓ ఫ్లాప్ వచ్చినప్పటికీ పిల్ల జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అదే స్పీడ్ తో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ బ్యూటీ.

ఛలో మూవీతో సక్సెస్ కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వంలో త్వరలోనే ఓ మూవీ చేయబోతున్నాడు నితిన్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను అనుకుంటున్నారు. ఆమె కూడా దాదాపు ఓకే చెప్పేసినట్టే.

ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన నోటా అనే సినిమా చేస్తోంది. మరోవైపు గోపీచంద్ తో చేస్తున్న పంతం సినిమాను కంప్లీట్ చేసింది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఎఫ్-2 అనే సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. ఇప్పుడు నితిన్ మూవీకి కూడా ఓకే చెప్పింది.

 

ప్రస్తుతం శ్రీనివాసకల్యాణం సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూవీ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా ఉంటుంది. దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో దాగుడు-మూతలు ప్రాజెక్టును కూడా సైమల్టేనియస్ గా పూర్తిచేసే ప్లాన్ లో ఉన్నాడు.