సెట్స్ పైకొచ్చిన ఆనంద్ దేవరకొండ సినిమా !

Tuesday,September 03,2019 - 12:53 by Z_CLU

‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ రెండో సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేసేశాడు. వినోద్ అనే డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు ఆనంద్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ అనే తమిళ్ హీరోయిన్ ని తీసుకున్నారు. వర్షకు తెలుగులో ఇది రెండో సినిమా. ఇటివలే ‘చూసీ చూడంగానే’ సినిమాలో నటించింది. ఆ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.

యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కనుందని సమాచారం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.