#RRR - రిలీజ్ ఎప్పుడంటే?

Wednesday,September 01,2021 - 06:10 by Z_CLU

ప్రస్తుతం మోస్ట్ ఏవైటింగ్ మల్టీస్టారర్ #RRR రిలీజ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. అవును ఉన్నట్టుండి సినిమా సంక్రాంతి బరిలో రానుందనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. దీంతో ఇప్పుడు సంక్రాంతి సినిమాల పరిస్థితి ఏంటి..? బడా సినిమాలు RRR కి స్పేస్ ఇచ్చి వాయిదా పడనున్నాయా ? అనే డైలమాలో ఉన్నారు సినీ అభిమానులు.

నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే RRR రాజమౌళి చెప్పినట్టే అక్టోబర్ 13న రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇంకా షూటింగ్ ఉండటంతో మేకర్స్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇంకా అఫీషియల్ గా బయటికి రాలేదు కానీ సినిమాను మొదట్లో ప్రకటించినట్లుగా సంక్రాంతి సీజన్ లోనే థియేటర్స్ లోకి దింపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట మేకర్స్.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇంకా రెండు మూడు నెలలు పట్టొచ్చని తెలుస్తుంది. అంటే మేకర్స్ చేతిలో ఇప్పుడున్న మంచి డేట్ అంటే అంటే అది సంక్రాంతి మాత్రమే. కానీ ఇప్పటికే ఆ సీజన్ కి అరడజను సినిమాలు ఫిక్స్ అయ్యాయి. వాటిలో పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న BheemlaNayak ప్రభాస్ Radheshyam, మహేష్ SarkaruVaariPaata ఫిక్స్ అయ్యాయి. ఇక నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్న ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

గతంలో నాగ్ ఈ సీక్వెల్ ని సంక్రాంతి కి అనుకుంటేనే చేస్తానని చెప్పారు కూడా.  మరి RRR పొంగల్ బరిలో నిలిస్తే మిగతా సినిమాల పరిస్థితేంటి..? వీటిలో ఏ సినిమాలు వాయిదా పడతాయి ? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పై మూవీ లవర్స్ లో ఉంత్కంఠ నెలకొంటుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics