‘వెంకీమామ’ కి లైన్ క్లియర్...

Tuesday,December 10,2019 - 12:31 by Z_CLU

‘వెంకీమామ’ సెన్సార్ క్లియరయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం కట్స్ లేకుండా U/A సర్టిఫికెట్ పొందింది. ఇప్పటికే వైడ్ రేంజ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 13 న రిలీజ్ కానుంది.

ఈ రియల్ లైఫ్ మామా, అల్లుళ్ళు సిల్వర్ స్క్రీన్ పై చూపించబోయే మ్యాజిక్ పై భారీ అంచనాలున్నాయి ఆడియెన్స్ లో. మామా అల్లుళ్ళ మధ్య సెంటిమెంట్ న్యాచురలే కానీ, దానికి మిలిటరీ బ్యాక్ డ్రాప్ జతయ్యేసరికి ‘వెంకీమామ’ ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ లో కూడా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిందీ సినిమా. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్. సురేష్ బాబు, T.G. విశ్వప్రసాద్ సంయుక్తంగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈ సినిమాని నిర్మించారు.