RRR Release Date - ఎనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

Tuesday,September 28,2021 - 03:50 by Z_CLU

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ సినిమా ‘RRR’ రిలీజ్ డేట్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేని విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండనే టాక్ గట్టిగా వినబడుతుంది. అయితే దీనిపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు. రిలీజ్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు రిలీజ్ చేస్తాం అంటూ చెప్పుకున్నారు.

అయితే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు చక్కబడుతున్నాయి. మహా రాష్ట్రాలో వచ్చే నెల నుండి థియేటర్స్ తెరుచుకోవచ్చని పర్మీషణ్ ఇచ్చారు. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా మెల్లగా సినిమా మార్కెట్ ఓపెన్ అవుతుంది. అందుకే మేకర్స్ ఇంకా కాస్త సమయం తీసుకొని వచ్చే సంక్రాంతికి రావాలని చూస్తున్నారట. అయితే తెలుగులో సంక్రాంతి కి ఇప్పటికే మూడు బడా సినిమాలు ఎనౌన్స్ అయ్యాయి.

కానీ వాటిలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే వస్తాయని తెలుస్తుంది. దానికి కారణం RRR అంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అంటూ ఓ డేట్ కూడా ఫిక్స్ చేశారట జక్కన్న అండ్ టీం. వచ్చే వారం లేదా పై వచ్చే వారంలో రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. నిజానికి RRR మొదటి రిలీజ్ డేట్ సంక్రాంతికే. కానీ కోవిడ్ వల్ల ఆ ఏడాది సంక్రాంతి కి సినిమాను తీసుకురాలేకపోయారు.

అందుకే ఇప్పుడు సినిమాలకు అతి పెద్ద సీజన్ అయిన సంక్రాంతికే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చి భారీ వసూళ్ళు రాబట్టాలని భావిస్తున్నారట. ఏదేమైనా రిలీజ్ డేట్ పై మేకర్స్ నుండి అప్ డేట్ వచ్చే వరకు దీనిపై క్లారిటీ రాదు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics