ఇది బాలయ్య కొట్టిన రికార్డ్...

Tuesday,December 10,2019 - 09:02 by Z_CLU

ఈ ఏడాది 3 సినిమాలు… స్టార్ హీరోలకి ఆల్మోస్ట్ ఇది అసాధ్యం. కానీ బాలయ్య ఇది పాసిబుల్ చేశాడు. ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలతో థియేటర్స్ లోకి వచ్చాడు.

NTR బయోపిక్ ని 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన బాలయ్య జనవరి 9 ‘కథానాయకుడు’ గా వస్తే జస్ట్ 1 మంత్ గ్యాప్ లో ఫిబ్రవరి 14 న ‘మహా నాయకుడు’ గా మెస్మరైజ్ చేశాడు. ఈ 2 సినిమాల తరవాత పెద్దగా గ్యాప్ తీసుకోని బాలయ్య ‘రూలర్’ అనౌన్స్ చేసినా అది మినిమం సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారంతా… కానీ రిలీజ్ డేట్ డిసెంబర్ 20 కి ఫిక్స్ చేసుకుని కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

స్టార్ హీరోలు ఏడాదికి ఓ సినిమా అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయి ఉన్నారు. అన్నీ కలిసొస్తే మహా అయితే ఏడాదికి 2 సినిమాలు. అంతేకానీ అంతకన్నా సినిమాలు చెయ్యట్లేదు. కానీ బాలయ్య ఈ విషయంలో డిఫెరెంట్ అనిపించుకున్నాడు.

ఇయర్ బిగినింగ్ లో ‘కథానాయకుడు’ గా బిగిన్ అయితే ఆ తరవాత ‘మహానాయకుడు’ ఇప్పుడు ఇయర్ ఎండ్ లో ‘రూలర్’ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఇది బాలయ్య కొట్టిన రికార్డ్.