రెజీనా ఇంట్రడక్షన్

Friday,November 18,2016 - 10:17 by Z_CLU

రవితేజతో తప్ప ఇంకా ఆ రేంజ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదని చిన్న లోటు తప్ప, రెజీనా టాలీవుడ్ లో తన స్టైల్ మార్క్ ఎప్పుడో క్రియేట్ చేసుకుంది. రీసెంట్ గా కృష్ణవంశీ సినిమాలో చాన్స్ కొట్టేసిన రెజీనా, ఇప్పుడు ఆ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ కోసం స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తుంది.

సాధారణంగా మన సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్స్ అంటే హీరోకే ఉంటుంది. కానీ అందరిలా ఆలోచిస్తే ఆ డైరెక్టర్ కృష్ణవంశీ ఎందుకు అవుతాడు…? అందుకే తన స్టైల్ లోనే డిఫెరెంట్ గా హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు కృష్ణవంశీ. దాదాపు 400 మంది డ్యాన్సర్స్ తో తెరకెక్కనున్న ఈ సాంగ్ షూటింగ్ ఈ నెల 24 న స్టార్ట్ అవుతుంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు.