బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్స్

Monday,February 25,2019 - 05:43 by Z_CLU

ఒక సక్సెస్ ఫుల్ సినిమాలో  చేసింది చిన్న రోలే అయినా, హీరోయిన్స్ కి ఉన్నపళంగా ఫేమ్ తీసుకొచ్చి పెడుతుంది. అదే ఎంత టాప్ స్థాయిలో ఉన్న హీరోయిన్ కైనా వరసగా ఓ రెండు అపజయాలు పడ్డాయంటే, అంతే స్పీడ్ గా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. అలా ఫామ్ లేకున్నా ఫేడ్ అవుట్ అవ్వకుండా ఒక్క బ్రేక్ రాకపోతుందా, నిరూపించుకోలేకపోతామా..? అని వెయిట్ చేస్తున్నారీ ముద్దుగుమ్మలు…

అనుపమ పరమేశ్వరన్ : అ..ఆ… తో ఇంట్రడ్యూస్ అయింది. ఆ సినిమాలో చేసింది చిన్న రోలే అయినా, అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు. వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఆ క్రేజ్ కి ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సక్సెస్ లు తోడయ్యేసరికి ఇక అనుపమ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదనుకున్నారు అందరూ… కానీ ఆ తరవాతే వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’, ‘తేజ్ ఐ లవ్ యు’, ‘హలో గురూ ప్రేమ కోసమే’  వరసగా ఆవరేజ్ అనిపించుకునేసరికి ఒక్కసారిగా ఫేడ్ అయిపోయింది. ఇతరత్రా భాషల్లో నటిస్తున్నా, తెలుగులో మాత్రం ఒక గట్టి బ్రేక్ పడాలని వెయిట్ చేస్తుందీ అనుపమ.

ఈషా రెబ్బ : ‘అంతకు ముందు ఆ తరవాత’ తో ఇంట్రడ్యూస్ అయిన ఈషా కరియర్ గ్రాఫ్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ సమ్ థింగ్ స్పెషలే. పర్ఫామెన్స్ దగ్గరి నుండి గ్లామర్ వరకు 100% హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్నా, కమర్షియల్ హీరోయిన్ గా ఇప్పటి వరకు తన మార్క్ రిజిస్టర్ చేసుకోలేకపోయింది. రీసెంట్ గా ‘అరవింద సమేత’ లో NTR సరసన కనిపించినా, బడా స్టార్స్ పక్కన హీరోయిన్స్ లిస్టులో మాత్రం ఇంకా చేరలేదు.

ప్రణీత సుభాష్ : ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తుకు వచ్చేది బొంగరాల్లాంటి కళ్ళే. ప్రణీత ఫిల్మోగ్రఫీ లో పవన్ కళ్యాణ్, NTR, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ ఉంటారు. కానీ అందులో డిజప్పాయింట్ మెంట్ ఏంటంటే ఆ సినిమాలో ఫీమేల్ లీడ్ మాత్రం డెఫ్ఫినెట్ గా ఇంకొకరుంటారు. ‘ఏం పిల్లో.. ఏం పిల్లాడో’ తో పరిచయం అయిన ప్రణీత టార్గెట్ టాప్ స్టార్సే అయినా, వాళ్ళు మాత్రం ఇంకా ప్రణీత ని సెకండ్ హీరోయిన్ గానే కన్సిడర్ చేస్తున్నారు. అందుకే కరెక్ట్ టైమ్ కోసం వెయిట్ చేస్తుందీ ప్రణీత.

కేథరిన్ థెరిసా : ‘చమ్మక్ ఛల్లో’ తో ఇంట్రడ్యూస్ అయినా, ఆ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా రిలీజైన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో మ్యాగ్జిమం ఇంప్రెస్ చేసేసింది కేథరిన్. ఆ తరవాత బడా సినిమాలో మరీ లీడ్ హీరోయిన్ గా చేసిందా అంటే యస్ అనైతే చెప్పలేం కానీ, ఆల్మోస్ట్ పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ లోనే కనిపించింది. అయినా ఎక్కడో ఇప్పటికీ, ఇంకా ప్రూఫ్ చేసుకోవాల్సిందే అనే స్థాయిలో ఉండిపోయింది కేథరిన్.

ప్రగ్యా జైస్వాల్ : పరిచయమైంది ‘డేగ’ సినిమాతో, ఆడియెన్స్ కి దగ్గరైంది మాత్రం ‘కంచె’ తో. అద్భుతమైన పర్ఫామెన్స్ తో, మెస్మరైజ్ చేసేసింది. మరో స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమైంది అన్నారంతా. కానీ ప్రగ్యా విషయంలో దానికి కంప్లీట్ గా అపోజిట్ జరిగింది. ఆఫర్స్ రాలేదా అంటే, నో అని చెప్పలేం కానీ చేసిన సినిమాలు బోల్తా పడటంతో,న్యాచురల్ గానే రేస్ లో వెనక పడిపోయింది.

రెజీనా కసాంద్ర : టాలీవుడ్ లో 100% ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అనే ఒపీనియన్ ఉన్నా, బిగ్ స్టార్స్ సరసన అవకాశాలే పెద్దగా రావట్లేదు రెజీనాకి. చేసినవి యూత్ ఫుల్ సినిమాలు సక్సెస్ అయ్యేసరికి, జస్ట్ యూత్ హీరోలకే పరిమితం అయిందనిపిస్తుంది. ఆ మధ్య రవితేజ తో ‘పవర్’ సినిమాలో కనిపించేసరికి ఆల్మోస్ట్ రెజీనా ట్రాక్ లో పడింది అనే లోపే, మళ్ళీ స్లో మోడ్ లో పడిపోయింది. అటు గ్లామర్, ఇటు పర్ఫామెన్స్ కి ఏ మాత్రం కాంప్రమైజ్ కాని రెజీనా కరియర్ మళ్ళీ ఏ సినిమాతో ట్రాక్ లోకి వస్తుందో చూడాలి.

సురభి : ఎపుడో 2015 లో ‘బీరువా’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయితే ఇప్పటి వరకు చేసింది జస్ట్ 5 సినిమాలు. కొంచెం స్లోగా ఉందేమోనన్న ఫీలింగ్ తప్పితే, అమ్మడు ఫిల్మోగ్రఫీ మాత్రం సూపర్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. చేసిన సినిమాలన్నీ దేనికవే స్పెషల్. కానీ వాటిలో  ఒక్క స్టార్ హీరో పేరు కూడా లేకపోవడం చిన్న లోటనిపిస్తుంది. అవకాశం రావాలే కానీ, సురభి కమర్షియల్ హీరోయిన్ స్టేటస్ కి మరీ దూరంగా లేదనిపిస్తుంది.