జీ సినిమాలు (నవంబర్ 18th )

Thursday,November 17,2016 - 07:57 by Z_CLU

tiger

నటీ నటులు : N.T.రామారావు, రజినీకాంత్, రాధా సాలుజా, సుహాసిని

ఇతర నటీ నటులు : అంజలీ దేవి, అల్లు రామలింగయ్య

మ్యూజిక్ డైరెక్టర్ : చెళ్ళపిళ్ళ సత్యం

డైరెక్టర్ : N. రమేష్

ప్రొడ్యూసర్ : G. గంగాధర రావు

రిలీజ్  : 5 సెప్టెంబర్ 1979

టాలీవుడ్ హిస్టరీలోనే వెరీ రేర్ కాంబినేషన్ NTR,సూపర్ స్టార్ రజినీకాంత్ కలిసి నటించిన చిత్రం. 1977 లో రిలీజైన ‘ఖూన్ పసీనా’ సినిమాకి రీమేకే ఈ చిత్రం. చిన్నప్పుడే విడిపోయిన ఇద్దరన్నాదమ్ములు ఎటువంటి పరిస్థితుల మధ్య పెరిగారు..? తిరిగి ఎలా కలుసుకున్నారు అనే కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. రాధా సాలుజా, సుహాసినీ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటించారు. చెళ్ళపిళ్ళ సత్యం ఈ సినిమాకి సంగీతం అందించారు.

——————————————————————

kaliyuga_pandavulu

 

నటీ నటులు : వెంకటేష్, ఖుష్బూ
ఇతర నటీనటులు : అశ్విని, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్  : 14 ఆగష్టు 1986

విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. వెంకటేష్, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమా వెంకటేష్ కరియర్ లో ఫస్ట్ సినిమా అయినా ఇదే. టర్నింగ్ పాయింట్ సినిమా కూడా ఇదే. మొదటి సినిమాతోనే వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందీ సినిమా. రాఘవేంద్ర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు.

——————————————————————

sri-krishna-tulabharam-1966

నటీ నటులు : N.T.రామారావు, జమున, అంజలి
ఇతర నటీనటులు : S.వరలక్ష్మి, L.విజయలక్ష్మి, కాంతారావు, రాజనాల, పద్మనాభం, వాణిశ్రీ
మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల
డైరెక్టర్ : K. కామేశ్వర రావు
ప్రొడ్యూసర్ : రామా నాయుడు
రిలీజ్ డేట్ : 1966

NTR కరియర్ లోని పౌరాణిక సినిమాల్లో ఒక ఆణిముత్యం శ్రీ కృష్ణ తులాభారం.. శ్రీకృష్ణుడు తన భార్యల మధ్య అపురూప సన్నివేశాలతో అద్భుతంగా తెరకెక్కిందే శ్రీ కృష్ణ తులాభారం.
పెండ్యాల సంగీతం అందించిన ఈ సినిమాకి K.కామేశ్వర రావు డైరెక్షన్ చేశారు.

——————————————————————

vaana

నటీ నటులు : వినయ్ రాయ్, మీరా చోప్రా
ఇతర నటీనటులు : సుమన్, నరేష్, జయసుధ, సీత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, M.S.నారాయణ, కృష్ణుడు తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : కమలాకర్
డైరెక్టర్ : శ్రీకాంత్ బుల్ల
ప్రొడ్యూసర్ : M.S.రాజు
రిలీజ్ డేట్ : 15 జనవరి 2008

హిట్ సినిమాల నిర్మాత M.S.రాజు రచించి, నిర్మించిన అద్భుత ప్రేమ కథా చిత్రం వాన. వినయ్ రాయ్, మీరా చోప్రా హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకి కమలాకర్ సంగీతం అందించాడు.

——————————————————————

agni-putrudu

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని నాగార్జున, రజని
ఇతర నటీనటులు : శారద, శివాజీ గణేషన్, సత్య నారాయణ, నూతన్ ప్రసాద్, గొల్లపూడి మారుతి రావు, రాళ్ళపల్లి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు
ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్
రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 1987

నాగార్జున కరియర్ లోని బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో ‘అగ్ని పుత్రుడు’ ఒకటి. తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నంలో జైలు పాలవుతాడు నాగార్జున. తాను నేరస్తుడు కాదు అని నిరూపించుకోవడానికి హీరో ఏం చేశాడు..? చెడును ఎలా అంతం చేశాడనే కథాంశంతో తెరకెక్కిందే రక్షణ. ఈ సినిమాకి K.రాఘవేంద్ర రావు డైరెక్టర్.

——————————————————————

preminchukundam-raa
నటీ నటులు : వెంకటేష్, అంజలా జవేరి
ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ
ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు
రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.