Raviteja Khiladi - టీజర్ రివ్యూ
Monday,April 12,2021 - 01:59 by Z_CLU
`క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఖిలాడి`.
మాస్ మహారాజా అభిమానులకు ఉగాది కానుకగా వారు ఎంతగానో ఎదురుచూస్తున్న` ఖిలాడి` టీజర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ అలరించనుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
యాక్షన్, హైఇంటెన్స్ ఎమోషన్స్‌తో పాటు రొమాన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
డింపుల్ హయాతితో ప్రేమలో ఉన్నట్లు కనిపించిన రవితేజ ఒక్కసారిగా ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించడంతో… అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిణామాలేంటో తెలుసుకోవాలిన ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్.

ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ ఒకే ఒక్క డైలాగ్‌తో జస్ట్ విజువల్స్ మరియు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో టీజర్ చాలా థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీనాక్షి చౌధరి, అర్జున్, థాకూర్ అనూప్ సింగ్, మురళి శర్మ, అనసూయ భరద్వాజ్ తదితరులు టీజర్‌లో కనిపించారు.
`ఇఫ్ యూ ప్లే స్మార్ట్ వితౌట్ స్టుపిడ్ ఎమోషన్స్..యూ ఆర్ అన్‌స్టాపబుల్` అంటూ రవితేజ్ చెప్పే ఒకే ఒక్క డైలాగ్ ఈ టీజర్‌కి హైలైట్ అయ్యింది. మొత్తానికి ఈ టీజర్ ఖిలాడి చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది.
సుజిత్ వాసుదేవ్, జి కె విష్ణు సినిమాటోగ్రఫీ మరియు దేవిశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి మేజర్ అసెట్స్. రవితేజ ఇంటెన్స్ పెర్‌ఫామెన్స్, భారీ బడ్జెట్‌తో రూపొందినందున ప్రతీ ఫ్రేమ్ లావీష్‌గా కనిపిస్తోంది.
రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics