VakeelSaab - వీకెండ్ కలెక్షన్

Monday,April 12,2021 - 02:22 by Z_CLU

ఈ ఏడాది రిలీజైన మొట్టమొదటి స్టార్ హీరో సినిమా వకీల్ సాబ్. అంతేకాదు.. లాక్ డౌన్ తర్వాత రిలీజైన ఫస్ట్ బిగ్ మూవీ కూడా ఇదే. అలా భారీ అంచనాల మధ్య, హయ్యస్ట్ థియేటర్స్ లో విడుదలైన వకీల్ సాబ్ సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఫస్ట్ డే వసూళ్లలో రికార్డ్ సృష్టించిన ఈ సినిమా, నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో వకీల్ సాబ్ సినిమాకు ఏపీ,నైజాంలో 53 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు ట్రేడ్ డిసైడ్ చేసింది. అయితే మేకర్స్ మాత్రం ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు.

తాజా వసూళ్లతో వకీల్ సాబ్ సినిమా 3 రోజుల్లోనే 65 శాతం బ్రేక్-ఈవెన్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్లలో మంచి హోల్డ్ ఉంది. కాబట్టి మరో 4 రోజుల్లో ఇది బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ వీకెండ్ కూడా వకీల్ సాబ్ హవా కొనసాగుతుంది. ఎందుకంటే, లవ్ స్టోరీ సినిమా పోస్ట్ పోన్ అయింది. సో.. ఈ వీకెండ్ నాటికి వకీల్ సాబ్ సినిమా మంచి లాభాలు అందుకునే అవకాశం ఉంది.

అటు ఓవర్సీస్ లో కూడా వకీల్ సాబ్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ప్రీమియర్స్ తో కలుపుకొని ఈ సినిమాకు ఇప్పటివరకు 6.5 లక్షల డాలర్లు వచ్చాయి. మరో 2 రోజుల్లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరయ్యేలా ఉంది.

టికెట్ రేట్లకు సంబంధించి ఏపీలో ప్రభుత్వానికి, వకీల్ సాబ్ బయ్యర్లకు మధ్య లీగల్ ఇష్యూ నడుస్తోంది. టికెట్ రేట్లపై ప్రభుత్వం రిలీజ్ చేసిన లేటెస్ట్ జీవో వివాదానికి కారణమైంది. దీంతో మేకర్స్ ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు ఎక్కడా కలెక్షన్లను అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. కనీసం ఓవరాల్ గ్రాస్ (ఓవర్సీస్ తో కలిపి) తో పోస్టర్ కూడా విడుదల చేయలేదు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics