'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో రిలీజ్ డేట్

Thursday,April 27,2017 - 05:00 by Z_CLU

నాగచైతన్య రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్స్ గా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్ పై అక్కినేని నాగార్జున  నిర్మిస్తున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే లో  రిలీజ్ కి రెడీ అవుతుంది.. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ తో పాటు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఆడియోను మే 1న డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేసి మే 13న అభిమానుల సమక్షం లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  భారీ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.. లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య-రకుల్ మధ్య లవ్ సీన్స్, ఫామిలీ ఎమోషన్ సీన్స్, సాంగ్స్ బాగా ఎంటర్టైన్ చేస్తాయంటున్నారు యూనిట్… ప్రస్తుతం ఫామిలీ ఎంటర్టైనర్స్ జోరు నడుస్తున్న టైం లో ఈ ఫామిలీ ఎంటర్టైనర్ ఎలాంటి హిట్ సాధిస్తుందో..చూడాలి.