పీక్ స్టేజ్ లో బాహుబలి మానియా

Thursday,April 27,2017 - 06:03 by Z_CLU

తెలుగు స్టేట్స్ లో బాహుబలి మానియా కట్టలు తెంచుకుంటుంది. ఏళ్ల తరబడి ఎదురు చూసిన క్షణం దగ్గర పడుతుండేసరికి బాహుబలి ఫ్యాన్స్ ప్రతి మూమెంట్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బాహుబలి రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలు బాహుబలి పోస్టర్స్ తో, కటౌట్స్ తో చేస్తున్న హంగామా మాహిష్మతి రాజ్యాన్ని తలపిస్తుంది.

బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ బాహుబలి 2 కి గ్రాండ్ వెల్కం చెప్తున్నారు ఫ్యాన్స్. క్లాస్, మాస్ అని తేడా లేకుండా టికెట్ల కోసం పోటీ పడుతున్న ఫ్యాన్స్ ఎక్కడ చూసినా బాహుబలి 2 గురించే డిస్కస్ చేస్తున్నారు.