ఫస్ట్ స్పేస్ మూవీ.. విడుదలకు సిద్ధం

Thursday,May 24,2018 - 07:28 by Z_CLU

ఇండియన్ సినీ హిస్టరీలోనే అంతరిక్షం కాన్సెప్ట్ తో వస్తున్న మొట్టమొదటి సినిమా టిక్-టిక్-టిక్. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమైంది. జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

బిచ్చగాడు సినిమాతో కళ్లుచెదిరే లాభాలు ఆర్జించిన చదలవాడ బ్రదర్స్ ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నారు. చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై చదలవాడ ప‌ద్మావ‌తి , చదలవాడ లక్ష్మణ్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.

 

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలొ ఈ సినిమా తెరకెక్కుతోంది. స్పేస్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా హిట్ అవుతుందంటున్నారు మేకర్స్.