Ranga Ranga Vaibhavanga థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా

Saturday,August 27,2022 - 03:20 by Z_CLU

వైష్ణవ్ తేజ్ , కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ సెప్టెంబర్ 2న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా టీం భారీ ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. ఇప్పటికే టూర్ మొదలు పెట్టి ఆడియన్స్ తో ఇంట్రాక్ట్ అవుతూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. సినిమా నుండి ఇప్పటి వరకూ రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా సాంగ్స్ , తీజర్ , ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి.

చిన్నతనం నుండి ఇగో కారణంగా మాట్లాడుకోవడం మానేసిన ఓ ఇద్దరి ప్రేమకథను అందంగా చూపిస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి దర్శకుడు గిరీశాయ యూత్ ఫుల్ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించాడు. “ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాలేదు. సాంగ్స్, విజువల్స్ అన్నీ చక్కగా కుదిరాయి. ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లో తప్పకుండా ఎంజాయ్ చేస్తారని  వైష్ణవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బేనర్ పై BVSN ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. సాంగ్స్ తో పాటు దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలైట్ అవ్వనుందని టీం గట్టిగా చెప్తున్నారు.