2022 Year End కొత్త దర్శకులు

Wednesday,December 21,2022 - 04:48 by Z_CLU

ప్రతీ ఏడాది లానే ఈ ఇయర్ కూడా కొందరు కొత్త దర్శకులు  మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. వారిలో కొందరు సక్సెస్ టేస్ట్ చేయగా ఇంకొందరు మంచి ప్రయత్నం అనిపించుకున్నారు. మరి ఈ ఇయర్ కొత్త దర్శకుల్లో బెస్ట్ డెబ్యూ అనిపించుకున్నదెవరు ? జీ సినిమాలు స్పెషల్ స్టోరీ.

 

ఒక కొత్త దర్శకుడు పెద్ద కథ ఎంచుకొని పర్ఫెక్ట్ గా డీల్ చేశాడని ప్రేక్షకులతో అభినందనలు అందుకోవడం చాలా గొప్ప విషయం. ఇక దానికి తోడు కలెక్షన్స్ పరంగానూ కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కీరిటం అతనిదే. ఈ ఏడాది బెస్ట్ డెబ్యూ అనిపించుకున్నాడు వసిష్ఠ. కళ్యాణ్ రామ్ తో ‘బింబిసార’ అనే ఫిక్షనల్ ఫాంటసీ డ్రామా తీసి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. నిజానికి ఈ తరహా కథను ఎలాంటి అనుభవం లేకుండా తెరకెక్కించి మెప్పించడం అంటే అంత సులువు కాదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించి కళ్యాణ్ రామ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేసి రెండో సినిమాను మరింత గ్రాండియర్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు వసిష్ఠ.

 

2022 లో ప్రేక్షకులను హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న మరో కొత్త దర్శకుడు విమల్ కృష్ణ. ‘డీజే టిల్లు’ తో ఈ ఏడాది డెబ్యూ ఇచ్చిన ఈ దర్శకుడు సిద్దు జొన్నలగడ్డ తో కలిసి థియేటర్స్ లో మంచి హాస్యం వడ్డించాడు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అనిపించుకున్న ఈ సినిమాతో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు విమల్.

 

‘మసూద’ అనే హారర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయి కిరణ్ కూడా ఈ ఏడాది బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ లిస్టులో చేరాడు. హారర్ జోనర్ కి ఉన్న గ్యాప్ గమనించి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. థ్రిల్ చేసే హారర్ ఎలిమెంట్స్ తో సూపర్ హిట్ కొట్టాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాతో ఊహించని హిట్ కొట్టి సాయి కిరణ్ తన టాలెంట్ నిరూపించుకున్నాడు.

 

సమంత ‘యశోద’ సినిమాతో హరీష్ -హరి దర్శకులుగా తెలుగులో డెబ్యూ ఇచ్చారు. సరోగసి పాయింట్ తో ఇంట్రెస్టింగ్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. దీంతో హరి -హరీష్ ఇద్దరూ తెలుగులో మొదటి సినిమాతోనే సక్సెస్ టేస్ట్ చూశారు.

 

శర్వానంద్ హీరోగా వచ్చిన  ‘ఒకే ఒక జీవితం’ తో తెలుగులో డెబ్యూ ఇచ్చిన తమిళ దర్శకుడు శ్రీ కార్తిక్  టైం ట్రావెల్ స్టోరీ , ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. టైం ట్రావెల్ కథతో కార్తీక్ చేసిన ఈ ప్రయోగానికి భారీ కలక్షన్స్ రాలేకపోవచ్చు కానీ సినిమా చూసిన అందరూ ఈ దర్శకుడిని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ను డిజైన్ చేసుకున్న విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 

హీరో రవితేజ ఈ ఏడాది రామారావు ఆన్ డ్యూటీ శరత్ మండవని దర్శకుడిని పరిచయం చేశాడు. రవితేజ ను  గవర్న్ మెంట్ ఆఫీసర్ రోల్ లో చూపించిన శరత్ ఈ సినిమాతో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు.  రిలీజ్ కి ముందు ఈ డైరెక్టర్ చాలా సౌండ్ చేశాడు కానీ సినిమాలో ఆ సౌండ్ కనిపించలేదనే కామెంట్ అందుకున్నాడు.

 

వెంకటేష్ ప్రత్యేక పాత్రలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘ఓరి దేవుడా’ సినిమాతో అశ్వథ్ మారిముత్తు కూడా ఈ ఏడాది తెలుగులో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తమిళ్ లో సూపర్ హిట్ అనిపించుకున్న ఓమై కడవులే ను రీమేక్ చేసిన అశ్విన్ తెలుగులో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు.

తమిళ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ చేసిన గిరీశాయ కూడా ఈ ఏడాది  ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చాడు. వైష్ణవ్ -తేజ్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. త్వరలోనే రెండో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

 

నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాచెర్ల నియోజక వర్గం’ సినిమాతో ఎడిటర్ శేఖర్ రెడ్డి ఏడాది  దర్శకుడిగా టర్న్ అయ్యాడు. దర్శకుడిగా మొదటి సినిమా అయినప్పటికీ యాక్షన్ పోర్షన్ ను బాగా హ్యాండిల్ చేశాడనే ఫీడ్ బ్యాక్ అందుకున్నాడు.

 

వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గని’ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. మొదటి సినిమాకే స్పోర్ట్స్ డ్రామా ఎంచుకున్న కిరణ్ ఊహించినంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కాకుండా ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీతో లాంచ్ అవ్వడం మెచ్చుకోవాల్సిన విషయం.

 

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ తో విద్యా సాగర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు రవి కిరణ్ కోలా సపోర్ట్ తో దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు.

 

ఈ ఏడాది థియేటర్స్ లో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన కొత్త దర్శకుల్లో లక్ష్మణ్ కృష్ణ ఒకడు. బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన ఈ సినిమాతో లక్ష్మణ్ టికెట్టు కొన్న ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకొని రావు రమేష్ , గోపరాజు పాత్రలను చక్కగా డిజైన్ చేసి మెప్పించాడు.

కొత్త దర్శకులు తీసిన కొన్ని సినిమాలు డబ్బు తీసుకొస్తే మరికొన్ని ప్రశంసలు అందిస్తాయి. ఈ ఏడాది వెంకటేష్ పెదిరెడ్ల అనే కొత్త దర్శకుడు తీసిన ‘అనుకోని ప్రయాణం’ డెబ్యూ డైరెక్టర్ కి మంచి ప్రశంసలు  అందించింది.  వలస కార్మికుల కథతో రాజేంద్ర ప్రసాద్ , నరసింహ రాజులతో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోయినా దర్శకుడికి మంచి పేరు తీసుకొచ్చింది.

రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘స్టాండప్ రాహుల్’ తో సాంటో , కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన  ‘  సెబాస్టియన్ PC 524 ‘  , ‘సమ్మతమే’  సినిమాలతో  బాలాజీ , గోపీనాథ్ రెడ్డి , అల్లూరి సినిమాతో ప్రదీప్ వర్మ , దొంగలున్నారు జాగ్రత్త తో సతీష్ త్రిపుర ఇలా మరికొందరు దర్శకులు కూడా ఈ ఇయర్ డెబ్యూ ఇచ్చారు. కానీ వీళ్ళల్లో ఎవరూ మొదటి సినిమాతో సౌండ్ చేయలేకపోయారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics