Brahmasta ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్

Saturday,August 27,2022 - 02:47 by Z_CLU

ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా, భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా “బ్రహ్మాస్త్ర”. తెలుగులో దీనిని బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

తాజాగా బ్రహ్మాస్త్రం ట్రైలర్ కి మెగాస్టార్ వాయిస్ ఓవర్ అందించి సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమాను తన స్పీచ్ తో సపోర్ట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని టీం అఫీషియల్ ప్రకటించారు. దీంతో #NTRforBrahmastra అనే టాపిక్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 2 న హైదరాబాద్ లో ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ కోసం ఓ భారీ వేదిక ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఏం చెప్తాడో ఏ రేంజ్ స్పీచ్ ఇస్తాడో చూడాల్సిందే.

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని 09.09.2022 న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.