రణరంగం సెన్సార్ పూర్తి.. ఆగస్ట్ 15 రిలీజ్

Thursday,August 08,2019 - 01:43 by Z_CLU

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో, సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది రణరంగం.

‘గ్యాంగ్ స్టర్’ అయిన హీరో జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లో శర్వానంద్ కనిపిస్తాడు. అతడి గెటప్, యాక్షన్ సినిమాకు పెద్దహైలెట్. హీరోయిన్లు కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించాడు.

టెక్నీషియన్స్
మాటలు: అర్జున్ – కార్తీక్
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
పోరాటాలు: వెంకట్
నృత్యాలు: బృంద, శోభి, శేఖర్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ