ఆగస్టు 15 నుంచి 'రణరంగం'

Wednesday,July 17,2019 - 12:22 by Z_CLU

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది.

చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’రణరంగం’ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయాలని నిర్ణయించాం. చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాలవారిని ఈ చిత్రం అలరిస్తుంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అన్నారు.

సినిమాలో శర్వానంద్ ఓ గ్యాంగ్ స్టర్. అతడి జీవితంలో 1990, 2000 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలే ఈ రణరంగం. ఇందులో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు శర్వ. హైఎమోషన్స్, స్క్రీన్ ప్లే ఈ సినిమా బలాలు.

మాటలు: అర్జున్ – కార్తీక్
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై
ఛాయాగ్రహణం :దివాకర్ మణి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ