రాక్షసుడు నుండి సాహో వరకు...

Tuesday,July 30,2019 - 11:02 by Z_CLU

ఇప్పటికే ఆగష్టు కలర్ ఫుల్ సినిమాల రిలీజ్ డేట్స్ తో ఫిక్స్ అయి ఉంది. ‘రాక్షసుడు’ తో స్టార్ట్ అయితే ‘సాహో’ వరకు ప్రతీది డిఫెరెంట్ జోనరే… సమ్ థింగ్ స్పెషలే…

రాక్షసుడు : ఆగష్టు 2 న రిలీజవుతుంది ఈ సినిమా. మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ టాలీవుడ్ కి కొత్త కాదు కానీ, అలాంటి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించడం మాత్రం కొత్తే… మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఈ హీరో కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి కథను ఎంచుకోవడం… ఎంతైనా కొంచెం స్పెషలే…

గుణ 369 : RX 100 కి ముందు ఎవరో కూడా తెలీని ఈ హీరో, ఈ సినిమా తరవాత మాత్రం నెక్స్ట్ ఏం చేస్తాడా..? అని ఎదురు చూసేలా చేశాడు. రీసెంట్ రిలీజ్ ‘హిప్పీ’ కొంచెం డిజప్పాయింట్ చేసినా, ఈ సినిమాతో కార్తికేయ మాస్ హీరో అనిపించుకోవడం గ్యారంటీ అనే వైబ్స్ అయితే వినిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే యాక్షన్ కూడా కాస్త  ఈ సినిమాకోసం గట్టిగానే చేశాడు కార్తికేయ. ‘గుణ 369’ కూడా ఆగష్టు 2 నే రిలీజ్.

మన్మధుడు 2 : ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్. నాగార్జునని చాలా రోజుల తరవాత రొమాంటిక్ యాంగిల్ లో ప్రెజెంట్  చేస్తున్న సినిమా ఇది. అక్కినేని ఫ్యాన్స్ కి ఇది వెరీ వెరీ స్పెషల్ సినిమా. ఆగష్టు 9 రిలీజ్ డేట్.

రణరంగం : శర్వా కరియర్ లోనే డిఫెరెంట్ ఎంటర్టైనర్. డాన్ లా నటించాడు శర్వా ఈ సినిమా కోసం. ట్రైలర్ లో కనిపిస్తున్నచిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ కే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సీరియస్ గెస్చర్ లో శర్వా మరింతగా నచ్చేస్తున్నాడు. ఇండిపెండెన్స్ డే నుండి ఈ సినిమా థియేటర్స్ లో ఉండబోతుంది.

ఎవరు : అడివి శేష్ సినిమాలంటే కంటెంట్ గ్యారంటీ అనే బ్రాండ్ క్రియేట్ అయింది ఫ్యాన్స్ లో. ఈ హీరోకి ‘గూఢచారి’ సినిమా సక్సెస్ క్రియేట్ చేసిన అంచనాలవి. ‘ఎవరు’ కూడా అదే స్థాయి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని ఫ్యాన్స్ ఫీలింగ్. ఈ సినిమా కూడా ఆగష్టు 15 న రిలీజవుతుంది.

సాహో :  ఈ సినిమా వల్లే ఈ ఏడాది ఆగష్టు మరింత స్పెషల్ అనిపించుకుంటుంది. కాకపోతే లాస్ట్ వీకెండ్ రిలీజ్ కాబట్టి ఈ సినిమా ఇంపాక్ట్ సెప్టెంబర్ లో కూడా ఉండబోతుంది. గత మూడేళ్ళుగా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ చూస్తున్న ఎదురు చూపులు…. ప్రభాస్ చార్మింగ్ యాక్షన్ పర్ఫామెన్సెస్… అన్నీ కలిసి ఆగష్టు ఎండ్ మరింత పవర్ ప్యాక్డ్ కాబోతుంది. ‘ఆగష్టు 30’ సాహో డేట్.. అదే రిలీజ్ డేట్.