సాహో ట్రయిలర్ రెడీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,August 08,2019 - 04:02 by Z_CLU

ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సాహో. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 10వ తేదీన ఈ ట్రయిలర్ లాంఛ్ అవుతుంది. కాకపోతే చిన్న ఛేంజ్. ముందుగా రిలీజ్ అయ్యేది సాహో హిందీ ట్రయిలర్. ఆ మరుసటి రోజు తెలుగు ట్రయిలర్ రిలీజ్ చేస్తారట.

సాహో సినిమాకు సంబంధించి ఇప్పటివరకు యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే చూపించారు. ట్రయిలర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా కొన్ని షాట్స్ ఉండబోతున్నాయి. ఎప్పట్లానే సినిమా రిచ్ నెస్ ను చూపించేలా ట్రయిలర్ ను కట్ చేశారు.

ట్రయిలర్ రిలీజ్ అయిన రోజు నుంచి వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటాడు ప్రభాస్. ఈ ప్రమోషన్స్ ను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా దేశంలోని ముఖ్యమైన 5 నగరాల్లో పర్యటించబోతున్నాడు యంగ్ రెబల్  స్టార్. ఆ టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ క్లూజివ్ గా తెలుగు ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఈనెల 30న థియేటర్లలోకి వస్తున్నాడు సాహో.