Maanaadu Remake - హీరో అతనేనా?

Tuesday,January 25,2022 - 03:53 by Z_CLU

Rana to do Maanaadu Remake?

ఇటివలే కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘మానాడు’ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థపై సురేష్ బాబు రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ కి సంబంధించి తెలుగు రైట్స్ కొనుగోలు చేసి ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై డిస్కషన్స్ జరుపుతున్నారు సురేష్ బాబు. ఇప్పటికే రవితేజతో పాటు సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోల పేర్లు కూడా ఈ ప్రాజెక్ట్ కి వినిపించాయి.

అయితే ఈ సినిమాను సురేష్ బాబు తనయుడు రానాతో తీయబోతున్నారని తెలుస్తుంది. తాజాగా రానా ఈ సినిమా చూశాడని, ప్రస్తుతం టీంతో కలిసి డిస్కషన్ చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్ . నిజానికి ఈ సినిమాలో శింబు చేసిన క్యారెక్టర్ కి ఒక యంగ్ హీరో అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే రానాతో సురేష్ బాబు ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ప్రస్తుతానికి ఈ రీమేక్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ సినిమాను ఎలాంటి మార్పులు లేకుండా ఒరిజినల్ సన్నివేశాలతోనే తీయాలని డిసైడ్ అయ్యారట సురేష్ బాబు. ఇంకా దర్శకుడు ఎవరనేది ఫైనల్ అవ్వలేదు. త్వరలోనే ఆ డీటెయిల్స్ కూడా బయటికి రానున్నాయి. ఒక యంగ్ హీరోయిన్ ని లాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమా రానాతో రీమేక్ చేసి తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ చేయాలని సురేష్ బాబు భావిస్తున్నారని తెలుస్తుంది.

simbu maanadu