Mahesh Trivikram Movie - కొత్త గాసిప్

Tuesday,January 25,2022 - 04:56 by Z_CLU

New Gossip on Mahesh Trivikram Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న SSMB28 సినిమాకు సంబంధించి రోజుకో గాసిప్ చక్కర్లు కొడుతుంది. ఇటివలే ఈ సినిమాలో సాయి పల్లవి మహేష్ కి చెల్లెలి పాత్రలో నటించనుందని ఓ న్యూస్ స్ప్రెడ్ అయింది. దాని గురించి మేకర్స్ నుండి ఇంకా క్లారిటీ లేదు. తాజాగా మరో గాసిప్ చక్కర్లు కొడుతుంది. మహేష్ సినిమాలో మోహన్ బాబు అనేది ఇప్పుడు లేటెస్ట్ గాసిప్.

త్రివిక్రమ్ సినిమాలో డిఫరెంట్ విలనిజం ఉంటుంది. తాజాగా జగపతి బాబు , సముత్రఖని ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి మెప్పించాడు. అదే తరహాలో మహేష్ సినిమాలో కూడా ఓ విలన్ పాత్రను డిజైన్ చేశారట. దాన్ని సీనియర్ హీరో మోహన్ బాబుతో చేయిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ అండ్ టీం భావిస్తున్నారని తెలుస్తుంది. ఇంకా మోహన్ బాబు ని అప్రోచ్ అవ్వలేదు కానీ మేకర్స్ మాత్రం ఆయన్నే ఫిక్స్ అయ్యారని టాక్.

గతంలో పూరి జగన్నాథ్ తీసిన ‘బుజ్జి గాడు’ సినిమాలో తనదైన నెగిటివ్ రోల్ తో ఆకట్టుకున్నాడు మోహన్ బాబు. కాకపోతే అది పూర్తి తరహ విలన్ పాత్ర కాదు. హీరోయిన్ అన్నయ్య పాత్ర పైగా హీరోతో క్లోజ్ గా ఉండే పాత్ర. అయితే ఈసారి త్రివిక్రమ్ మాత్రం ఆయనతో పూర్తి స్థాయి విలన్ పాత్ర చేయించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ అవ్వనుంది. అలాగే ఇటివలే సూర్య సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. మరి ఈ క్రమంలో మహేష్ బాబు సినిమాకు మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? వేచి చూడాలి.