Bheemla Nayak - ట్రయిలర్ రివ్యూ

Monday,February 21,2022 - 10:12 by Z_CLU

Bheemla Nayak Trailer Review

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు
సాగర్. కె. చంద్ర.

ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 9గంటలకు విడుదల అయింది. ట్రైలర్ ను గమనిస్తే….
‘‘సర్హద్‌ భీమ్లానాయక్‌.. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌.. శ్రీశైలం తహసీల్దారు, హఠకేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్‌. నేను ఇవతల ఉంటేనే చట్టం… అవతలకొస్తే కష్టం.. వాడికి’’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.

అభిమానులకు పండగే అన్నట్లు త్రివిక్రమ్‌ సంభాషణలు సమకూర్చారు. పవన్‌, రానాల మధ్య సాగే సంభాషణలు పవర్‌ఫుల్‌గా ఉండడమే కాక అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ‘‘నాయక్‌… నీ ఫ్యాన్స్‌ వెయిటింగ్‌ ఇక్కడ’’ అని ట్రైలర్‌ చివరిలో రానా చెప్పిన డైలాగ్‌లకు థియేటర్‌ దద్దరిల్లేలా కనిపిస్తోంది.

సంభాషణలు, పోరాట దృశ్యాలు, పాటలు, నేపథ్య సంగీతం దేనికదే ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా సాగి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశాయి. పవన్ కళ్యాణ్, రానా, నిత్య మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, పమ్మి సాయి, రామకృష్ణ లు పాత్రోచితంగా ట్రైలర్ లో కనిపించి అలరిస్తారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా, ట్రైలర్‌ తో పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేసింది.