Balakrishna - ఆ దర్శకుడితో ఫిక్స్?

Tuesday,January 25,2022 - 03:46 by Z_CLU

Balakrishna to do a Movie in Geetha Arts Banner

‘అఖండ’ సక్సెస్ తో జోరుమీదున్న నందమూరి బాలకృష్ణకి సంబంధించి మరో సినిమా లాక్ అవ్వనుందనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఒక సినిమా అనిల్ రావిపూడితో మరో సినిమా లాక్ చేసుకున్నాడు బాలకృష్ణ. ఈ రెండు సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్ బేనర్ లో ఒక సినిమా చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం అల్లు అరవింద్ తో బాలయ్య చాలా చనువుగా ఉంటున్నారు. అల్లు అరవింద్ అడగ్గానే ఓ టాక్ షో ఒప్పుకొని హోస్ట్ గా మారాడు కూడా.

అదే బాండింగ్ తో ఇప్పుడు బాలయ్యతో ఓ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అరవింద్. తాజాగా వశిష్ట్ మల్లిడి అరవింద్ గారికి ఓ స్క్రిప్ట్ వినిపించాడని ఆ కథ బాలయ్యకి పర్ఫెక్ట్ అని టీం ఆలోచిస్తున్నారని ఇన్సైడ్ టాక్. వసిష్ట్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ‘భింబిసార’ అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

ఆ సినిమా తర్వాత వసిష్ట్ రెండో సినిమా గీతా ఆర్ట్స్ లోనే చేయాల్సి ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పై ఈ సినిమాతో ఒక యువ నిర్మాతను పరిచయం చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే టీం బాలయ్యని అప్రోచ్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే రిటైర్ అయ్యే పోలీస్ ఆఫీసర్ తనకున్న టైంలో రౌడీలను ఎలా అంతమొందించాడు ? అనే కథ రెడీ అవుతుందని సమాచారం. అన్ని మసాలాలు మిక్స్ అయి యాక్షన్ కి స్కోప్ ఉండే ఈ పాయింట్ తో బాలయ్య సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రావడం ఖాయం. ఒక వేళ బాలయ్య ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ బయటికొస్తాయి.