తన ప్రేమకథ బయటపెట్టిన రానా

Saturday,May 23,2020 - 04:04 by Z_CLU

సడెన్ గా లవ్ మేటర్ బయటపెట్టి హాట్ టాపిక్ గా మారిన రానా… ఇప్పుడు తన ప్రేమకథను కూడా బయటపెట్టాడు. మంచు లక్ష్మితో లైవ్ ఛాట్ చేసిన రానా.. మిహికా తనకు ఎలా పరిచయం, ఎప్పుడు ప్రేమ మొదలైంది.. ఇంట్లో తన లవ్ మేటర్ ను ఎలా చెప్పాడు లాంటి విషయాల్ని బయటపెట్టాడు.

– మనమేంటో మనం తెలుసుకున్నప్పుడు మనకు ఏం కావాలో, ఎవరు కావాలో ఈజీగా అర్థమౌతుంది. అలాంటి టైమ్ లో సరైన వ్యక్తిని కలిసినప్పుడు ప్రేమ పుడుతుంది. కొన్నేళ్ల నుంచి మిహీకా నాకు తెలుసు. కానీ ఈమధ్యే లవ్ ఫీలింగ్ కలిగింది

– వెంకటేష్ బాబాయ్ కూతురు అశ్రిత, మిహిక క్లాస్ మేట్స్. అలా నాకు చాలా ఏళ్లుగా మిహీకా తెలుసు. పైగా తను ముంబయిలో పెరిగిన అమ్మాయి. అక్కడ మా గ్యాంగ్ అంతా ఒక్కటే. ఎప్పుడూ ఆమెను ఆ ఫీలింగ్ తో చూడలేదు. ఈ మధ్యే ఇదంతా జరిగింది.

– మిహికాకు ప్రపోజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఓ రోజంతా ఆలోచించాను. మరుసటి రోజు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకు తను నన్ను కలిసింది. ఇక అక్కడ్నుంచి అంతా అలా జరిగిపోయింది.

– ఇంట్లో కూడా నా లవ్ మేటర్ 2-3 నిమిషాల్లో అలా అలా చెప్పేశాను. నేనేం చిన్నపిల్లాడ్ని కాదు కదా. బాగా మెచ్యూర్ అయ్యాను. పైగా ఇంట్లో కూడా నా పెళ్లి కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలుసు. అందుకే సింపుల్ గా ఉన్నదున్నట్టు చెప్పేశాను

– మొన్న జరిగిన ఫంక్షన్ కేవలం రోకా (గెట్ టు గెదర్ లాంటిది) మాత్రమే. ఆమెకు రింగ్ తొడగడం లాంటివేమీ జరగలేదు. ఫ్యామిలీ మీటింగ్ అంతే. ఎంగేజ్ మెంట్ అని అనుకున్నా తప్పులేదు.