పెళ్లి తర్వాత రానా-మిహీకా ఇలా..!

Wednesday,August 12,2020 - 05:36 by Z_CLU

ఎట్టకేలకు రానా ఓ ఇంటివాడయ్యాడు. 35 ఏళ్ల వయసులో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశాడు. పెళ్లయితే చేసుకున్నాడు కానీ హనీమూన్ ను ఎంజాయ్ చేద్దామంటే బయట కరోనా ఉంది. దీంతో చేసేదేం లేక ఇంట్లోనే కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు మన భళ్లాలదేవుడు.

నిజానికి పెళ్లి తర్వాత నవదంపతులిద్దరూ ముంబయి వెళ్లాలని ప్లాన్ చేశారు. అక్కడ మిహీకా బజాజ్ కుటుంబానికి పెద్ద విల్లా ఉంది. అందులో కొన్ని రోజులు జాలీగా గడపాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ముంబయి కూడా వెళ్లకుండా హైదరాబాద్ లోని రానా ఇంటికే పరిమితమైంది ఈ జంట.

అలా పెళ్లి తర్వాత రానా ఇంటికి మకాం మార్చిన మిహీకా.. తన కొత్త జీవితానికి సంబంధించిన ఫస్ట్ ఫొటోను షేర్ చేసింది. ఇప్పుడు మేం ఒక ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ పెట్టింది.