Rana Marriage: ఆ రిపోర్ట్ తప్పనిసరి

Wednesday,August 05,2020 - 06:26 by Z_CLU

రానా పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 3 రోజుల్లో (ఈనెల 8న) రానా పెళ్లి చేసుకోబోతున్నాడు. రోకా ఫంక్షన్ నిర్వహించిన రామానాయుడు స్టుడియోస్ లోనే రానా-మిహీకా పెళ్లి జరుగుతుంది.

ఇక పెళ్లికి కేవలం 30 మందిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలిపారు సురేష్ బాబు. సినీ-రాజకీయ ప్రముఖులు ఎవ్వరికీ ఆహ్వానాలు పంపించలేదు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరుగుతుంది.

పెళ్లికి హాజరయ్యే వాళ్లంతా కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకుంటారు. రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిందని తేలిన తర్వాతే పెళ్లికి వస్తారు. ఇక పెళ్లిలో కూడా అడుగడుగునా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయబోతున్నారు. ప్రతి చోట శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు.

పెళ్లిని సింపుల్ గా కానిచ్చేసి, కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటుచేస్తామంటున్నారు సురేష్ బాబు.