హాట్ టాపిక్: మహేష్ సినిమాలో స్పెషల్ గెస్ట్

Saturday,May 23,2020 - 12:53 by Z_CLU

ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ గాసిప్ మహేష్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ఆ మేటర్ వినగానే ఫ్యాన్స్ సంతోషపడుతూ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అభిమానులని అంతగా ఖుషి చేస్తున్న ఆ గాసిప్ ఏమిటా అనుకుంటున్నారా ?

#Mahesh27లో నమ్రత ఓ గెస్ట్ రోల్ చేయనుందట. సినిమాలో ఓ గెస్ట్ రోల్ కి నమ్రత అయితే బాగుంటుందని తన మనసులో మాటను మహేష్, నమ్రతలకు చెప్పాడట పరశురాం. క్యారెక్టర్ వినగానే మహేష్ , నమ్రత ఇద్దరూ ఓకే చెప్పారని టాక్.

‘గీతగోవిందం’లో ఓ గెస్ట్ రోల్ ను అను ఇమ్మాన్యుయేల్ తో చేయించాడు పరశురాం. అంతే కాదు అదే సినిమాలో నిత్యా మీనన్ తో కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయించాడు. ఇప్పుడు మహేష్ సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడట.

కాకపోతే ఈసారి నమ్రత తో గెస్ట్ రోల్ అనేసరికి అది హాట్ టాపిక్ గా మారింది. ఇదే నిజమైతే నమ్రతకు ఇది రీఎంట్రీ అనుకోవాలి.