రానా పెళ్లి ఎప్పుడంటే?

Sunday,May 31,2020 - 03:45 by Z_CLU

ఇటివలే తన ప్రేమను యాక్సెప్ట్ చేసిన సంగతి చెప్తూ తన ప్రియురాలిగా మిహికాను అందరికి పరిచయం చేసిన రానా అదే స్పీడుతో రోక ఫంక్షన్ కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి పెళ్లికి పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 8న రానా-మిహికా పెళ్లి జరుగనుందని టాక్. ఈ పెళ్లిని హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట.

అన్నీ అనుకున్నట్లు జరిగి, అప్పటికి పరిస్థితి చక్కబడితే వీరి వివాహానికి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా హాజరవుతారు. ప్రస్తుతం రానా ‘విరాటపర్వం’ సినిమా చేస్తున్నాడు. అది దాదాపు చివరి దశకు చేరుకుంది.

పెళ్లి తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ‘హిరణ్యకశిప’ షూటింగ్ మొదలు పెడతాడు రానా.