రెండో సాంగ్ కూడా సూపర్ హిట్

Monday,October 28,2019 - 12:04 by Z_CLU

సామజవరగమన అనే లిరిక్స్ తో సాగే సాంగ్ ఇప్పటికే హిట్ అయింది. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సాంగ్ హవా కొనసాగుతుండగానే బన్నీ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చింది. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అవును.. అల..వైకుంఠపురములో సినిమా నుంచి రిలీజైన రెండో సాంగ్ “రాములో రాముల..” కూడా చార్ట్ బస్టర్ గా నిలిచి, ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

రిలీజైన 24 గంటల్లోనే ఈ పాటకు 8.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇంకా చెప్పాలంటే.. 24 గంటల్లో ఇన్ని వ్యూస్ సాధించిన సౌత్ సాంగ్ ఇదొక్కటే. అంతలా ఈ పాట ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అంతా చెప్పినట్టు పాట వినాలో, విజువల్స్ చూడాలో అర్థంకాని విధంగా.. అటు వీనుల విందుగా, ఇటు విజువల్ ఫీస్ట్ గా వచ్చింది ఈ సాంగ్.

ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో 11 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇదే జోరు కొనసాగితే ఇది సామజవరగమన సాంగ్ ను క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాసర్ల శ్యామ్ రాసిన అద్భుతమైన సాహిత్యానికి… అనురాగ్ కులకర్ణి, మంగ్లి వాయిస్ కొత్త అందాన్ని తీసుకొచ్చింది.

మొత్తమ్మీద ఈ రెండు పాటలతో అల..వైకుంఠపురములో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. మూవీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది.