విజయ్ సినిమాతో శ్రీదేవి కూతురు ఎంట్రీ ?

Monday,October 28,2019 - 10:30 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేసాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు.

అయితే విజయ్ కి హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను తీసుకోనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నిర్మాత ఛార్మి జాన్వి డేట్స్ కోసం ప్రయత్నిస్తుందని, ఆ డేట్స్ ఖరారవ్వగానే అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. జాన్వి తెలుగులో హీరోయిన్ గా సినిమా చేయాలనేది శ్రీదేవి కోరిక కూడా. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది.