అల వైకుంఠపురములో మూడో పాట

Wednesday,November 13,2019 - 05:09 by Z_CLU

సినిమాల నుంచి ఇలా లిరికల్ వీడియోస్ రిలీజ్ అవ్వడం పెద్ద బ్రేకింగ్ కాదు. అది ఓ రొటీన్ ప్రాసెస్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ అల వైకుంఠపురములో సినిమా నుంచి మూడో పాట వస్తోందనేది మాత్రం కచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఎందుకంటే…

ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ సాంగ్ సామజవరగమన పెద్ద హిట్. ఎంత పెద్ద హిట్ అంటే, సౌత్ లోనే నంబర్ వన్ అది. అక్కడితో ఆగలేదు మేనియా. రెండో సాంగ్ రాములో రాములా మరో ఎత్తు. ఫోక్ స్టయిల్ లో సాగే ఈ పాట కూడా పెద్ద హిట్. ఇలా వరుసగా వచ్చిన రెండు పాటలు సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత మూడో పాట గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే.

ఆ మూడో పాట రేపు రిలీజ్ అవుతోంది. #OMGdaddy అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్ డే కానుకగా వస్తున్న ఈ సాంగ్ లో స్వీట్ సర్ ప్రైజ్ ఉంటుందంటున్నాడు బన్నీ.