తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూ

Monday,October 28,2019 - 12:10 by Z_CLU

‘పెళ్లి చూపులు’ తో డైరెక్టర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్నాడు. నవంబర్ 1న సినిమా విడుదల కానున్న సందర్భంగా  తరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

 

అస్సలు నమ్మలేదు

విజయ్ ఫోన్ చేసి తరుణ్ నువ్వే హీరో అంటే అస్సలు నమ్మలేదు. జోక్ చేయకురా అన్నాను. నిజంగానే ఈ సినిమాకి నీలాంటి వాడే కావాలని పట్టు బట్టి మరీ ఒప్పించాడు నన్నువిజయ్. తాను చేయాలంటే ప్రెజెంట్ తనకి డేట్స్ ఖాళీ లేవు, అలా అని సినిమా ని వదిలేదమ్మా అంటే వేరే ఇండస్ట్రీ కి ఈ స్టోరీ ని ఇచ్చేయడం విజయ్ కి ఇష్టం లేక ఓకే చేసాడు.

టైం దొరికింది

ముందు విజయ్ నువు ఎలా ఉన్నవో అలా ఉంటే చాలు అన్నాడు. కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒరేయ్ కొంచెం తగ్గాలిరా నువ్వు అన్నాడు. ఎలాగూ నేను కూడా తర్వాతి సినిమా కోసం రీసెర్చ్ చేస్తూ ఖాళీ గానే ఉన్న.. టైం దొరికింది, కష్టపడి తగ్గా.

డైరెక్షన్ …నా ప్యాషెన్

నేను నా కెరీర్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నా. సెట్ లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ కి హెల్ప్ చేస్తా. వేరే సినిమా సెట్స్ కి వెళ్ళి కొత్త విషయాలు నేర్చుకుంటుంటా.  డైరెక్షన్ అనేది నా ప్యాషెన్. కానీ నేను ఏ పనైనా చేస్తా.

కొన్ని రోజులు ట్రావెల్ చేశా

షార్ట్ ఫిలిం మేకర్ తో నాకు చాలా కంఫర్ట్ గా ఉంది. నిజానికి వాళ్ళు ఏదైనా చేసేస్తారు . నేను కూడా కొన్ని రోజులు ఆ దిశగా ట్రావెల్ చేశా కదా. ఒకేలా ఆలోచిస్తుంటాం.

విజయ్ స్టోరీ.. అనుకోకుండా 

కథ వింటున్నప్పుడు నాకు తెలీదు ఈ సినిమా లో నేనొక రోల్ ప్లే చేస్తానని. విజయ్ దగ్గరకి స్టోరీ వచ్చింది. ఆ స్టోరీ  వినమంటే ఫ్రెండ్లీ నేచర్ తో వెళ్లి 2 గంటలు కథ విన్నా. వినగానే చెప్పా చాలా రెలెవెంట్ గా బావుంది విజయ్ కథ.. మంచి సీన్స్ తో బాగా రాసాడు అని చెప్పా. కట్ చేస్తే విజయ్ కి వచ్చిన స్టోరీలో నేను నటించాల్సి వచ్చింది.

మా విజయ్ తోనే కదా

సినిమాలో ఇప్పటి వరకూ తెలంగాణ స్లాంగ్ పెద్దగా టచ్ లేదు.  విజయ్ ఆ స్లాంగ్ తోనే పాపులర్ అయ్యాడు. అందుకే ఎవరు ఆ స్లాంగ్ ట్రై చేసిన విజయ్ తో కంపేర్ చేస్తున్నారు. ఏదైనా హ్యాపీ నే. మా విజయ్ తోనే కదా కంపేర్ చేస్తున్నది.

అలవాటుంది..కానీ

ప్రమోషన్స్ ను ముందుండి నటుడిగా నడిపించడం  చాలా టైర్డ్ గా అనిపిస్తుంది. కాకపోతే అలవాటు అయినా విషయమే కదా. ‘పెళ్లి చూపులు’ టైంలో కూడా కొత్త కాబట్టి ప్రొమోషన్స్ కోసం చాలా ఇంటర్వూస్ ఇవ్వాల్సొచ్చింది. అలా అలవాటుంది. ఇక ఇప్పుడు అది నా బాధ్యత.

ప్రైవసీ గురించి

ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రతిదీ పబ్లిక్ చేసేస్తున్నాం. ఒక ఇన్స్టాగ్రామ్ ఐడీ తో ఒక పర్సన్ గురించి మొత్తం చెప్పేయొచ్చు అనేంతగా మారిపోయాము మనం. సో ఏది ఎంత వరకు ప్రైవసీ అనే దాని గురించి ఎంటర్టైనింగ్ గా రెండు గంటల పాటు చూపించబోతున్నాం.

ఇప్పుడేం చెప్పలేను

గోమఠం పాత్ర ఇంతకు ముందలానే ఉండబోతుంది. కాకపోతే ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడేం చెప్పలేను. ఇంటరెస్టింగ్ గా, సెన్సిబుల్ గా చాలా మంచి క్యారెక్టర్ రాసాడు షమ్మీర్ .

నా క్యారెక్టర్ కి ఎదుగుదల అదే

డైరెక్టర్ గా అప్పుడప్పుడు ఈగో బయటికొచ్చినా అది కావాలి ఇది కావాలి అని, అదేమి బయటకి రాకుండా ఉండటమే నా క్యారెక్టర్ కి ఎదుగుదల అనుకుని యాక్టర్ గానే ఉన్నా.

సలహాలు ఇవ్వలేదు

నా జడ్జిమెంట్ కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అలాంటప్పుడు పక్కనోళ్ళ కథను పాడు చేయడమెందుకని ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. పైగా డైరెక్టర్ కి ఈ జోనర్ లో  చాలా అనుభవముంది.  సో నేను కేవలం నటుడిగా దర్శకుడు చెప్పింది చేస్తూ పోయాను.

నేనే సంభాషణలు రాసా

సినిమాకి నేనే సంభాషణలు రాసా. డైరెక్టర్ తమిళ్ వెర్షన్ రాసాడు. వాటిని నేను తెలుగులోకి రాసా. కొన్ని కొన్ని మ్యాపులు చేశా ప్లేస్, స్లాంగ్ లాంటివి. ఫలానా టైపు క్యారెక్టర్ కావాలి అని. ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ కిందకి వస్తాయి కానీ సెట్స్ కి వెళ్ళాక ఏమి చేయలేదు.

 

డైరెక్షన్ వల్లే ఎక్కువ డబ్బులొస్తాయి

నిజం చెప్పాలంటే నాకు డైరెక్షన్ వల్లే ఎక్కువ డబ్బులొస్తాయి. దానికి తోడు ఇంకా చాలా కథలున్నాయి వాటిని పాతబడే లోపు రెడీ చేసుకుని సినిమాలు చేయాలి. వరుసగా మూడు ప్లాప్ లు వస్తే అప్పుడు మల్లి యాక్టింగ్ సైడ్ చూస్తా తప్పించి ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలేమి లేవు.

చాలా కథలున్నాయి

విజయ్ తో చేయడానికి చాలా కథలున్నాయి. కానీ ఇప్పుడు విజయ్ ఇమేజ్ ని చూసుకుని దానికి తగ్గట్లు కథ రెడీ చేసుకుని చూడాలి. ఎలాగూ విజయ్ దగ్గర ఇప్పుడు డేట్స్ కూడా లేవు కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండ మళ్ళీ మేమిద్దరం సినిమా చేస్తాం.

 స్పోర్ట్స్ డ్రామాతో 

స్పోర్ట్స్ డ్రామా అనుకుంటున్నా కానీ ఇంకా రీసెర్చ్ చేయాలి కొంచెం టైం పడుతుంది . డిసెంబర్ ఎండింగ్ వరకూ పూర్తి స్క్రిప్ట్ రెడీ అవుతుంది. ఆ తర్వాత షూట్ ఎప్పుడనేది తెలుస్తుంది.