నా రికార్డ్ తొందరగా బద్దలవ్వాలి - అల్లు అర్జున్

Saturday,February 01,2020 - 01:59 by Z_CLU

ఎవరైనా తమ రికార్డు పది కాలాల పాటు పదిలంగా ఉండాలని కోరుకుంటారు. బన్నీ మాత్రం తన రికార్డు తొందరగా బద్దలవ్వాలని కోరుకుంటున్నాడు. అల వైకుంఠపురములో సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో బన్నీ ఈ కామెంట్స్ చేశాడు.

“రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.”

“ఇంకో విషయం.. ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు, పెద్దలు స్మోక్ చేయవద్దు. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మరోసారి నా అభిమానులకు, నా ఆర్మీకి థాంక్స్. కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్”