రామ్ – పూరి కొత్త సినిమా టైటిల్ ‘ఇస్మార్ట్ శంకర్’

Thursday,January 03,2019 - 04:36 by Z_CLU

రామ్ కొత్త సినిమా టైటిల్ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు మేకర్స్. రామ్, పూరి కాంబినేషన్ లో సినిమా అనగానే క్రియేట్ వైబ్స్ ని డబుల్ చేస్తుంది ఈ మోషన్ పోస్టర్. తలకిందులుగా ఉన్న రామ్ స్టిల్, సినిమాలో క్యారెక్టర్ ఎంత అగ్రెసివ్  గా ఉండబోతుందో హింట్స్ ఇస్తుంది. మరీ ముఖ్యంగా రామ్ హెయిర్ స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అసలే ఎనర్జిటిక్ స్టార్… ఆ ఎనర్జీకి, ‘డబుల్ సిమ్ కార్డ్’ ‘డబుల్ దిమాక్  హైదరాబాదీ’ అనే ట్యాగ్స్ ఎటాచ్ చేయడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. వీటికి  ఎగ్జాక్ట్ మీనింగ్  ఏంటనేది  ఫిల్మ్ మేకర్స్  రివీల్ చేయకపోయినా, రామ్ మ్యానరిజం సినిమాలో ఏ స్థాయిలో ఉండబోతుందనేది తెలుస్తుంది.   అల్టిమేట్ గా 100%  పూరి మార్క్  తో తెరకెక్కనుంది ‘ఇస్మార్ట్  శంకర్’.

https://twitter.com/ramsayz/status/1080773651023069184

సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ సినిమాపై మేకర్స్ క్రియేట్ చేస్తున్న బజ్ చూస్తుంటే, ఈ సినిమాపై టీమ్ కి ఉన్న కాన్ఫిడెన్స్ ఎలివేట్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన పూరి టీమ్, జనవరి లాస్ట్ వీక్ కల్లా సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉన్నారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్, చార్మి ప్రొడ్యూసర్స్.