ప్రభాస్ ‘సాహో’ లో కొత్తగా చేరిన ఎలిమెంట్

Wednesday,July 11,2018 - 03:26 by Z_CLU

సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ప్రభాస్ ‘సాహో’. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. దాంతో ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు స్టెప్పులేయనున్న హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే పనిలో పడింది సినిమా యూనిట్.

పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సెట్స్ పైకి వచ్చిన ‘సాహో’ బిగినింగ్ లో అసలీ స్పెషల్ సాంగ్ ఆలోచన కూడా లేదు. కానీ సడెన్ గా సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అని ఫిక్సయిన ఫిల్మ్ మేకర్స్, ఈ సాంగ్ కోసం స్పెషల్ గా సిచ్యువేషన్  క్రియేట్ చేసి మరీ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ ‘సాహో’ సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న ఈ స్పెషల్ సాంగ్ పై మళ్ళింది.

 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా వరకు బాలీవుడ్ నటుల్ని పిక్ చేసుకున్న ఫిల్మ్  మేకర్స్, ఈ స్పెషల్ సాంగ్ కోసం కూడా బాలీవుడ్ స్టార్ నే ప్రిఫర్ చేస్తారా..? లేకపోతే టాలీవుడ్ హీరోయిన్స్ ని సంప్రదిస్తారా..? అనేది ఫ్యాన్స్ మైండ్ లో రేజ్ అయిన మిలియన్ డాలర్ క్వశ్చన్..? ఏది ఏమైనా ఈ సస్పెన్స్ బ్రేక్ అవ్వాలంటే ‘సాహో’ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సాహో టీమ్ ఈ రోజు నుండే మరో కొత్త షెడ్యూల్ బిగిన్ చేసింది. ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.