తమిళ్ డైరెక్టర్ తో Ram సినిమా?

Monday,January 11,2021 - 02:14 by Z_CLU

మరో రెండు రోజుల్లో Red సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. లాక్ డౌన్ కి ముందే ‘రెడ్’ షూటింగ్ పూర్తి చేసాడు Ram. అయితే ఇంత వరకు తన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ మాత్రం ఎనౌన్స్ చేయకుండా ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తున్నాడు.

మొన్నటివరకు త్రివిక్రమ్ తో రామ్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని తేలిపోయింది. తాజాగా రామ్ తమిళ దర్శకుడు RT నేసన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. కోలీవుడ్ లో ‘జిల్లా’ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న ఈ దర్శకుడు తాజాగా రామ్ కి ఓ యాక్షన్ కథ వినిపించి ఒప్పించాడట.

నేసన్ తెలుగులో సినిమా చేయాలని ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తో తెలుగులో సినిమా చేయాలని చూసాడు. ఆ సినిమా ఓపెనింగ్ తర్వాత ఆగిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు మళ్ళీ రామ్ తో సినిమా తీసి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట.

త్వరలోనే ఈ కాంబినేషన్ సినిమాపై రామ్ నుండి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.