Oka Pathakam Prakaram సాంగ్ రిలీజ్ చేసిన రామ్

Wednesday,June 08,2022 - 03:47 by Z_CLU

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఒక పథకం ప్రకారం’.  జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నాడు. ఈయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో  రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ “ఓసారిలిరా” లిరికల్ సాంగ్‌ను హీరో రామ్ పోతినేని విడుదల చేసాడు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట అనూహ్యమైన స్పందన దక్కించుకుంటుంది.

ఓసారిలిరా.. ఓసారిలా..
కుడికాలు మోపి గుడిలోకి రా..
ఓసారిలిరా.. ఓసారిలా..
విరహాలు తీరా.. ఒడిలోకి రా..

ఊగాలిలా ఉయ్యాలలా.. నీతో ఇలా జతగా.. అంటూ మంచి లిరిక్స్ అందించారు రెహమాన్. ఇప్పటికే రవితేజ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌లో సినిమా కాన్సెప్టును చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా టీమ్ లో ఉన్నారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.